- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే కోవలక్ష్మి
by Bhanu |
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లోని గోలేటి 1ఏ ఓపెన్ కాస్టు ను త్వరతగతిన ప్రారంభించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కోరారు.

X
దిశ, తాండూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లోని గోలేటి 1ఏ ఓపెన్ కాస్టు ను త్వరతగతిన ప్రారంభించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కోరారు. సోమవారం హైదరాబాద్ లోని సిఎండి కార్యాలయంలో సింగరేణి సిఎండి బలరాం నాయక్ ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మాట్లాడుతూ గోలేటి 1ఏ ఓపెన్ కాస్టు ప్రారంభమైతే ప్రత్యక్షం, పరోక్షంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎండీ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
Next Story






