రైతు సంక్షేమానికి ప్రభుత్వం తో కొట్లాడుతా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Bhanu |   (  Updated:2025-04-25 09:49:53  IST  )

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తో కొట్లాడుతానని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం తో కొట్లాడుతా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, నిర్మల్ : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తో కొట్లాడుతానని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి బి, బోరిగాం, మలక్ చించోలి , స్వర్ణ గ్రామాల్లో ఆయన జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతుల కోసం ఎంతకైనా తెగిస్తానన్నారు. వారికి ఎల్లవేళలా అవసరమైన సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నరేష్, రాంశంకర్ రెడ్డి, వెంకటేష్, విలాస్, నారాయణ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సాహెబ్ రావ్, గంగారెడ్డి, చెన్న రాజేశ్వర్, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి , నారాయణ, ఇప్ప భూమారెడ్డి, పోతన్న, తిరుమల చారి, దయాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, పతాని నర్సయ్య, తోట భోజన్న, మోహన్, అంబాజీ తదితరులు పాల్గొన్నారు.

Next Story