- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది : మంత్రి వివేక్
దిశ, మందమర్రి : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని మంత్రి వివేక్ తెలిపారు. మందమర్రి పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మండలం

దిశ, మందమర్రి : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని మంత్రి వివేక్ తెలిపారు. మందమర్రి పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్మిక గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార అహంకారంతో అవినీతిలో మునిగిపోయిందని, ఆ అవినీతిని గుర్తించిన ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 25 వేల మెజారిటీతో గెలవడం ఎవ్వరూ ఊహించనిది అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా హైప్ కోసం, సర్వేల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందజేస్తున్నట్టు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూం, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారు. కానీ మా ప్రభుత్వం వస్తే వెంటనే పేదలకు న్యాయం జరుగుతోంది. దొడ్డు బియ్యాన్ని ఆపి సన్న బియ్యం అందిస్తున్నాం అని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అఖండ విజయం ఖాయమని, మంచి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇటీవల మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రఘునాథ్ రెడ్డిని మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు.






