- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర సాధన : మంత్రి జూపల్లి
దిశ, ఆసిఫాబాద్ : జల్, జంగల్, జమీన్ కోసం నైజాం నవాబుల పై తిరుగుబాటు చేసి అసువులు బాసిన ఆదివాసీ వీరుడు కొమురం భీం పోరాట

దిశ, ఆసిఫాబాద్ : జల్, జంగల్, జమీన్ కోసం నైజాం నవాబుల పై తిరుగుబాటు చేసి అసువులు బాసిన ఆదివాసీ వీరుడు కొమురం భీం పోరాట స్ఫూర్తినే తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకారం అయిందని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కెరమెరి మండలంలోని జోడేఘాట్ కొమురం భీం 85వ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భీం విగ్రహానికి. సమాధికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎమ్మెల్సీ దండే విఠల్. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మే బోజ్జు. భీం మానవుడు సోనేరావులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మంత్రి జూపల్లి మాట్లాడారు. కొమురం భీం. రాంజీ గోండు. బిర్సా ముండే వంటి ఆదివాసీల పోరాటంతోనే పీసా 1/70 చట్టాలు వచ్చాయని గుర్తుచేశారు. ఆదివాసీ గిరిజనులు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి హైమన్ డార్ఫ్ దంపతుల పరిశీధన ఫలితంగా ఆదివాసీలకు హక్కులు ప్రత్యేక చట్టాలు రూపొందించారని పేర్కొన్నారు.
ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి లక్ష్మణ్
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసీ గ్రామాల్లో రోడ్డు, భవనాల నిర్మాణం కోసం సీఎం ఆదేశాల మేరకు 15 రోజుల కిత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏలకు రూ.740 కోట్లు విడుదలకు జీవో ఇచ్చినట్లు తెలిపారు. వెనుకబడిన ఆదివాసీ గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యాను అందించడంతో పాటు వారు చదువుకుంటున్న ఆశ్రమ పాఠశాలలో అభివృద్ధి సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి కేంద్రంతో మాట్లాడి అటవీ అనుమతులు పొందేలా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ గొడం నాగేష్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దిపక్ తివారీ, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్వో నీరజ్ కుమార్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, పాల్వాయి హరిష్ బాబు, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప పాల్గొన్నారు.






