- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈదురు గాలుల ప్రభావం.. నేలకూలిన భారీ వృక్షాలు
సోనాల–ఇచ్చోడ ఆర్&బీ ప్రధాన రహదారి పై ఇటీవల వీచిన తీవ్ర ఈదురు గాలుల కారణంగా పలు భారీ వృక్షాలు నేలకూలి రహదారి పై పడిపోయాయి.

దిశ, బజార్ హత్నూర్ : సోనాల–ఇచ్చోడ ఆర్&బీ ప్రధాన రహదారి పై ఇటీవల వీచిన తీవ్ర ఈదురు గాలుల కారణంగా పలు భారీ వృక్షాలు నేలకూలి రహదారి పై పడిపోయాయి. ఈ మార్గం గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే ప్రజలు ప్రయాణం సాగిస్తుండగా, పడిపోయిన చెట్లు రాకపోకలకు తీవ్రమైన ఆటంకంగా మారాయి. రోడ్డు మధ్యలోనే వృక్షాలు పడిపోవడంతో వాహనదారులు వంకర్లు తిరుగుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు పణంగా పెట్టుకుని ప్రయాణం కొనసాగిస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. వెలుతురు లేకపోవడం, చెట్ల పొదలు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనాలు నేరుగా వాటిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రమాదాలు సంభవించినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు పలుమార్లు సంబంధిత ఆర్&బీ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్&బీ అధికారులు స్పందించి, రహదారి పై పడిపోయిన వృక్షాలను వెంటనే తొలగించి, ప్రయాణికులకు భద్రత కల్పించాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






