- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరవీరుల త్యాగాలు మరువలేనివి : సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందిరామయ్య
దిశ, ఖానాపూర్ : అమరవీరుల త్యాగాల పోరాటాలను మరువలేవని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నంది రామయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 01 నుంచి 07 వరకు

దిశ, ఖానాపూర్ : అమరవీరుల త్యాగాల పోరాటాలను మరువలేవని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నంది రామయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 01 నుంచి 07 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జరుపుకోవడం భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో వర్గపీడన, దోపిడి, కుల వ్యవస్థ, మతాలు, మూఢనమ్మకాలు, సాంఘిక రాజకీయ అసభనతలు అంతరించి పోవాలని విప్లవ ఉద్యమంలో ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన వారి త్యాగాలను మరిచిపోలేవని ఆయన కొనియాడారు. వారి బాటలోనే విప్లవోద్యమానికి కలసికట్టుగా పోరాడాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ ప్రారంభానికి ముందు అమరవీరుల జ్ఞాపకార్థం కోసం మౌనం పాటిస్తూ సభను ప్రారంభించారు. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యవర్గ సభ్యులు జక్కుల రాజన్న, మచ్చ శ్రీనివాస్, సుదర్శన్, యాదవ్, కుర్మా రాజన్న పాల్గొన్నారు.






