- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ కేటుగాళ్ల వలలో వివాహిత..!
దిశ, మందమర్రి : రోజు రోజుకు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ ఫై అధికారులు హెచ్చరిస్తుప్పటికీ కొందరూ మాత్రం మోసపోతూనే ఉన్నారు. తాజాగా మందమర్రి పట్టణంలో

దిశ, మందమర్రి : రోజు రోజుకు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ ఫై అధికారులు హెచ్చరిస్తుప్పటికీ కొందరూ మాత్రం మోసపోతూనే ఉన్నారు. తాజాగా మందమర్రి పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహిత సైబర్ కేటుగాళ్ల వల్లలొ పడింది. తన మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాగ్రామ్ చూస్తుండగా.. జాబ్ ఆఫర్లు రావడంతో ఆ లింకును ఓపెన్ చేయగా.. వాట్సాప్ లో సైబర్ క్రైమ్ కేటుగాడు వివాహిత ఒకరికొకరు జాబు గురించి చర్చించుకొని ముందుగా రూ.300 రూపాయలు ఆ కేటుగాడు వివాహితకు పంపించడం జరిగింది. దీనితో ఆ వివాహిత ఆ సైబర్ క్రైమ్ కేటుగాడిని సులువుగా నమ్మింది. ఆసరాగా తీసుకున్న సైబర్ దొంగ మాయమాటలు చెప్పి ఈ జాబులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతకు డబల్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో వివాహిత ముందుగా రూ.5000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత సైబర్ దొంగ ఇలాంటి మాయమాటలు ఎన్నో చెప్పి దాదాపు రూ. 27 వేల వరకు ఆ వివాహిత వద్ద నుంచి డబ్బులు లాగాడు. తన పిల్లల స్కూలు ఫీజు కోసం దాచుకున్న ఫీజు మొత్తాన్ని సైబర్ మోసగాడి మాయలో పడి ఆ వివాహిత డబ్బులు పోగొట్టుకుంది. దీంతో చేసేది ఏమిలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.






