తీవ్ర మానసిక వేదనతో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య

by Bhanu |

మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీలో సోమవారం ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

తీవ్ర మానసిక వేదనతో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య
X

దిశ, మందమర్రి: మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీలో సోమవారం ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. జీవితంపై విరక్తితో కటకం శ్రీనివాస్ (45) అనే వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుండి శారీరకంగా పనులు చేయలేని స్థితిలోకి చేరిన శ్రీనివాస్, మానసికంగా కూడా బలహీనతకు లోనయ్యాడు.

ఈ నేపథ్యంలో మద్యానికి బానిసై జీవితం పట్ల విరక్తి చెందాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై అతని భార్య కటకం రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


Next Story