మద్యం వ్యసనంతో జీవితానికి ముగింపు.. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

by Bhanu |

మండలంలోని పార్డి బి గ్రామానికి చెందిన తోట రమేష్ (34) మద్యం వ్యసనంతో బాధపడుతూ ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మద్యం వ్యసనంతో జీవితానికి ముగింపు.. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
X

దిశ, కుబీర్ : మండలంలోని పార్డి బి గ్రామానికి చెందిన తోట రమేష్ (34) మద్యం వ్యసనంతో బాధపడుతూ ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎస్సై ఏ. కృష్ణారెడ్డి వెల్లడించారు.వివరాల ప్రకారం.. రమేష్ కొంతకాలంగా మద్యం కు బానిసైపోయాడు.


ఏ పని చేయకుండా మద్యం మత్తులోనే కాలం గడిపేవాడు. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్న అతను చివరకు ఇంట్లోనే ఉరివేసుకుని జీవితాన్ని ముగించుకున్నాడు. అతడికి భార్య సంగీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటనపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story