- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశదారు తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్ట్..
మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశదారును తరలిస్తూ అర్లి గ్రామ శివారులో పట్టుబడిన మందపల్లి గ్రామానికి చెందిన మెస్రం కొండు అను వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆదిలాబాద్ సిఐ రేండ్ల విజేందర్ తెలిపారు.

దిశ, ఆదిలాబాద్ : మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశదారును తరలిస్తూ అర్లి గ్రామ శివారులో పట్టుబడిన మందపల్లి గ్రామానికి చెందిన మెస్రం కొండు అను వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆదిలాబాద్ సిఐ రేండ్ల విజేందర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలో అక్రమ దేశదారుపై ఉక్కు పాదం మోపడం జరుగుతుందని ఈ క్రమంలోని ముందస్తు సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం లోని అర్లి గ్రామ శివారులో అక్రమంగా దేశదారు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి ఆయన వద్ద నుంచి సుమారు పదివేల రూపాయల విలువ చేసే 280 అనుమతి లేని దేశదార మద్యం సీసాలను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్టు చేసినట్లు వివరించారు. అయితే అక్రమంగా మహారాష్ట్ర నుంచి అనుమతి లేని దేశదారును జిల్లాకు తరలించి విక్రయించినట్లయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిబ్బంది తానాజీ, నానంగ్ సింగ్, వెంకటగిరి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.






