- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాడవి తుకారాం ని ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
దిశ, ఉట్నూర్ : దివంగత మాడవి తుకారాం ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం మండలంలోని లక్షెట్టిపేట, ఎక్స్ రోడ్డు లలో మాడవి

దిశ, ఉట్నూర్ : దివంగత మాడవి తుకారాం ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం మండలంలోని లక్షెట్టిపేట, ఎక్స్ రోడ్డు లలో మాడవి తుకారాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్స్ రోడ్డు లో గల మాడవి తుకారాం విగ్రహానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆయన కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులు, వర్ధంతి నిర్వహణ కమిటీ సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాడవి తుకారాం ఆదివాసీ సమాజంలో జన్మించి ఐఏఎస్ స్థాయికి చేరుకున్న గొప్ప మేధావి అని కొనియాడాడు. ఆనాడు ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో ఉన్నత స్థాయిలో ఉంటే, నేడు చదువులో రాణించే విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆదివాసీ సమాజంలోనీ విద్యార్థులు ఈయనను ఆదర్శంగా తీసుకొని ఐఏఏస్, ఐపీఎస్, ఉన్నతమైన పదవుల్లో ఉండాలని ఆకాక్షించారు. వర్ధంతి వేడుకలకు కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ ఆత్రం సుగుణక్క విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, మేధావులు పాల్గొన్నారు.






