అమ్మ కోసం ఆరాటం..చికిత్స పొందుతున్న శిశువు..!

by Ratna Kumari |

దిశ, ఉట్నూర్ : తల్లి పొత్తిళ్ళలో ఉండాల్సిన శిశువు.. తల్లి కోసం ఆరాటపడుతున్న ఈ హృదయకార దృశ్యం అందరి హృదయాలను కలచివేసింది. ఇటీవల ప్రసవ వేదనకు గురై మరో శిశువుతో

అమ్మ కోసం ఆరాటం..చికిత్స పొందుతున్న శిశువు..!
X

దిశ, ఉట్నూర్ : తల్లి పొత్తిళ్ళలో ఉండాల్సిన శిశువు.. తల్లి కోసం ఆరాటపడుతున్న ఈ హృదయకార దృశ్యం అందరి హృదయాలను కలచివేసింది. ఇటీవల ప్రసవ వేదనకు గురై మరో శిశువుతో పాటు తల్లి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన అందరికీ తెలిసిందే. మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన టేకం జంగుబాయి కవలలకు ప్రసవం ఇస్తున్న సమయంలో ఒక శిశువుని ప్రసవించి మరొక శిశువుకి ప్రసవిస్తుండగా ఆ శిశువుతో పాటు తల్లి సైతం మృతి చెందింది. వెంటనే ప్రాణాలతో ఉన్న శిశువును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయు లో చికిత్స పొందుతున్నాడు. శిశువుతో నానమ్మ ఉంది.

చిన్నారి ఏడుపుతో కంట తడి పెట్టుకున్న తండ్రి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువును చూసేందుకు తండ్రి ఆసుపత్రికి బుధవారం వచ్చాడు. తల్లి పొత్తిళ్ళలో ఉండాల్సిన శిశువు తల్లి పాల కోసం ఆరాటపడుతున్న సమయంలో తండ్రి ఆనంద్ రావ్ రావడంతో శిశువును చూసి ఒక్కసారిగా కంట తడి పెట్టుకున్నారు. తల్లి లేదని ఎలా తెలియజేసేది అంటూ బోరున విలపించడంతో అక్కడ ఉన్నవారందరూ కంటతడి పెట్టుకున్నారు. తన భార్యను నేను బతికించుకోలేక పోయానని.. ప్రసూతి సమయంలో తన భార్యను ఆసుపత్రికి తరలించే క్రమంలో నానా తంటాలు పడ్డామని కనీసం ఎవరికైన ఫోన్ చేయాలన్న సిగ్నల్స్ లేక తల్లడిల్లిపోయామని బోరున విలపించాడు. తమ గ్రామానికి సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కు తోచనీ స్థితిలో ఉన్నానని విలపించారు. తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ కూడా రాని దుస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితులు మరెవరికి జరగకుండా అధికారులు, నాయకులు చూడాలని కోరుతున్నాడు.

Next Story