తెరుచుకుని లింబుగూడ పాఠశాల.. వ్యవసాయ పనుల్లో పిల్లలు

by Chintha Aamani |

మండలంలోని లింబుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల గురువారం తెరుచుకోలేదు.

తెరుచుకుని లింబుగూడ పాఠశాల.. వ్యవసాయ పనుల్లో పిల్లలు
X

దిశ, వాంకిడి : మండలంలోని లింబుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల గురువారం తెరుచుకోలేదు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోవడంతో ఉదయం 10 దాటిన పాఠశాల తాళం తీసే వారు లేకుండా పోయారు. దీంతో పాఠశాలకు వచ్చిన గిరిజన పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సత్యనారాయణ ను ఫోన్ లో సంప్రదించగా పాఠశాల ఉపాధ్యాయులు సెలవుకు వెళ్ళిందని చెప్పారు. అయితే రెండు తరగతులకు ఒకే టీచర్ ఉండడం,ఆమె సెలవు పై వెళ్తే, పాఠశాల బంద్ ఉంటుందని, దీంతో తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ఎంఈవో చొరవ తీసుకుని ఉపాధ్యాయురాలు సెలవుకు వెళ్తే.. మరో ఉపాధ్యాయుడికి ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి పాఠశాల కొనసాగించేలా తగు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story