దారి తప్పి జనావాసాల్లోకి జింక

by Dishanational1 |
దారి తప్పి జనావాసాల్లోకి జింక
X

దిశ, నస్పూర్: దారి తప్పి జనావాసాల్లోకి జింక వచ్చిన ఘటన నస్పూర్ పట్టణంలో చోటు చేసుకుంది. నస్పూర్ పట్టణంలోని కృష్ణ కాలనీ శివాలయ ప్రాంగణంలోకి ఆర్కే 5 అరణ్యం నుండి దారి తప్పి జింక రావడంతో వీధి కుక్కలు వెంటపడ్డాయి. గమనించిన కృష్ణ కాలనీ నివాసి గరిగే లక్ష్మణ్ కుక్కలను తరిమి జింకను రక్షించి 100కు సమాచారం అందించాడు. వెంటనే బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యం అక్కడకు చేరుకుని శ్రీరాంపూర్ ఎస్సై మానసకు సమాచారం అందించాడు. ఎస్సై అటవీ సిబ్బందికి సమాచారం తెలపడంతో బీట్ ఆఫీసర్ శ్రీవాణి అక్కడికి చేరుకుని జింకను ఆటోలో తీసుకెళ్లారు.


Next Story

Most Viewed