- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
దిశ, ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని

దిశ, ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ లను రద్దు చేస్తూ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం,రైతుసంఘం, టీఏజీఎస్ ఆధ్వర్యంలో మావల మండల కేంద్రంలో దగ్ధం చేశారు.కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేసిందని,కరోనా కష్టకాలంలో దొంగ దారిన పార్లమెంటులో ఆమోదించుకుందని ఆరోపించారు. సంఘం పెట్టుకునే హక్కును,సమ్మె చేసే హక్కును, కనీస వేతనాలు అడిగే హక్కును, ఉద్యోగ భద్రతను కార్మిక వర్గానికి దూరం చేసిందన్నారు. లేబర్ కోడ్ లు అమలులోకి రాకుండా భారత కార్మిక వర్గం ఐక్యంగా గత ఐదు సంవత్సరాలుగా దేశవ్యాప్త సమరశీల పోరాటాలను నిర్వహిస్తూ వస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని లేనిపక్షంలో కార్మిక వర్గం దేశవ్యాప్త ఐక్యపోరాటాలకు సన్నద్ధం అవుతుందని హెచ్చరించారు. సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి ఏఆర్ సింధు, రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్ ఎస్వీ రమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ.జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, లంక రాఘవులు, పూసం సచిన్ పాల్గొన్నారు.






