- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు భైంసాకు కేటీఆర్ రాక..!
దిశ, భైంసా : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మంగళవారం భైంసాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నారని వస్తున్నారని బీఆర్ఎస్ ముధోల్ సమన్వయ నాయకులు

X
దిశ, భైంసా : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మంగళవారం భైంసాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నారని వస్తున్నారని బీఆర్ఎస్ ముధోల్ సమన్వయ నాయకులు విలాస్ గాదేవర్, పడకంటి రమాదేవి తెలిపారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలొ పత్తి రైతుల కష్టాలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్, భైంసాకు సందర్శించనున్నారని తెలిపారు. వరుసగా సీసీఐ కొనుగోళ్ళు బంద్, తేమ శాతంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ నేపథ్యంలో కేటీఆర్ భైంసా మార్కెట్ ను సందర్శించనున్నారు. బీఆరెస్ కార్యకర్తలు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Next Story






