- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
దిలావర్పూర్ మండలంలోని కంజర్ గ్రామంలో కొండ్రు ఎర్రన్న (45) అనే వ్యక్తి మద్యానికి బానిసై మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలంలోని కంజర్ గ్రామంలో కొండ్రు ఎర్రన్న (45) అనే వ్యక్తి మద్యానికి బానిసై మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నర్సవ్వ ఫిర్యాదుతో దిలావర్పూర్ ఏఎస్ఐ భీమ్ రావు సంఘటన స్థలానికి చేరుకొని ఎర్రన్న ఆత్మహత్య కు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం కోండ్రు ఎర్రన్న మద్యానికి బానిసై ఉదయం ఇంటి నుంచి వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదని మామిడి తోటలోకి వెళ్లిన వ్యక్తులకు మృతదేహం కనిపించిందని సమాచారము ఇవ్వడంతో ఇక్కడ కు వచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ భీమ్రావు తెలిపారు.
Next Story






