4 న ఖానాపూర్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక..

by Kodari Anjali |

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఈ నెల నాలుగున జరిగే ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

4 న ఖానాపూర్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక..
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఈ నెల నాలుగున జరిగే ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో, పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లకు పార్టీల వారిగా సీటింగ్ ఏర్పాటు చేసి, తాగునీరు అందించాలని పేర్కొన్నారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుతో అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రమాకాంత్, సీఐ అజయ్ కుమార్, అధికారులు, తదితరులు పాలుగున్నారు.

Next Story