- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ఎక్కిన కేజీబీవీ విద్యార్థులు
దిశ, వాంకిడి : వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఓ తమను తీవ్ర అనుచిత వ్యాఖ్యలతో మానసిక వేధింపులకు గు

దిశ, వాంకిడి : వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఓ తమను తీవ్ర అనుచిత వ్యాఖ్యలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు శనివారం తరగతులను బహిష్కరించి రోడ్డు ఎక్కారు. తల్లిదండ్రులతో కలిసి మూకుమ్మడిగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ఎస్ వో మేడం మాకు వద్దంటే.. వద్దు.. కలెక్టర్ రావాలే మాకు న్యాయం చేయాలే అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎస్ వో గత కొంతకాలంగా నుంచి తనను..తమ తల్లిదండ్రులను అకారణంగా తీవ్ర పదజాలంతో దూషిస్తోందని.. కోడి గుడ్లు సైతం ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. మేడమ్ టార్చర్ వల్ల పాఠాలు చదవలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పై తగు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎస్ఐ వచ్చి విద్యార్థులతో మాట్లాడి నచ్చజెప్పె ప్రయత్నం చేసినా వినలేదు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.






