కౌటాల ప్ర‌ధానోపాధ్యాయుడు సస్పెండ్

by Ratna Kumari |

దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కౌటాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.నారాయణ సింగ్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ శనివారం

కౌటాల ప్ర‌ధానోపాధ్యాయుడు సస్పెండ్
X

దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కౌటాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.నారాయణ సింగ్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పురుగుల అన్నం, నీళ్ల చారు తో విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేయడంతో, జిల్లా విద్యాధికారి దీపక్ తివారి, కాగజ్ న‌గ‌ర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా శనివారం విచారణ జరిపి నివేదిక అందించారు. దీంతో కౌటాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ సింగ్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్న భోజనం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Next Story