- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ను అక్రమ రవాణా చేసిన కేసులో నలగురికి జైలు శిక్ష
దిశ, ఆసిఫాబాద్ : మహిళా ను అక్రమ రవాణా చేసిన కేసులో నలగురికి జైలు శిక్ష విధించిన ఘటన ఆసిఫాబాద్ లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి

దిశ, ఆసిఫాబాద్ : మహిళా ను అక్రమ రవాణా చేసిన కేసులో నలగురికి జైలు శిక్ష విధించిన ఘటన ఆసిఫాబాద్ లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్ వివేక్ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ నితిక పంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను గౌరుబాయి వెంకటి హరిదాస్ (కానిస్టేబుల్) పని ఇస్తామని మాయ మాటలు చెప్పి.. మధ్య ప్రదేశ్ లోని లాలాగిరి గోస్వామి అనే వ్యక్తి రూ.1.30 వేలు విక్రయించారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు తిర్యాణీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి వివేక్ గౌరుబాయి, ఏఈ వెంకటి, ఏ3 హరిదాస్ లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించారు. ఏ4 లాలాగ్రి గోస్వామికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు విధించారు.






