జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

by Disha Web Desk 1 |
జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
X

దిశ, కాగజ్ నగర్: భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సర్ సిల్క్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ ఉపప్రధాని స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మహనీయుడని అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,

బీజేపీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో..

బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల సందర్భంగా బుధవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్, సిర్పూర్ భాజపా నాయకుడు డా.పాల్వాయి హరీష్ బాబు.. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయ వేత్త అని కొనియాడారు.

పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో..

పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో సర్ సిల్క్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed