- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Additional Collector : మున్సిపాలిటీ వార్డుల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలి..
మున్సిపాలిటీ వార్డుల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.

దిశ, కాగజ్ నగర్ : మున్సిపాలిటీ వార్డుల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం కాగజ్ నగర్ మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాలకు పలు వార్డుల్లో మురుగునీటి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పరిశీలించారు. కాల్వల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరు ఇండ్లలోకి చేరిందని కాలనీవాసులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. నీరు కమ్మడంతో కాల్వ పక్కన ఉన్న ఇండ్ల గోడలు కూలిపోయినట్లు సమస్యను వివరించారు. 22 వార్డులో భారీ వర్షానికి ఇండ్లు కూలిపోయిన వారికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ లావణ్య కలెక్టర్ ను కోరారు.
అన్వర్ స్కూల్ ఎదురుగా ఎలక్ట్రికల్ ఐరన్ పోల్స్ వైర్లు ఇండ్లపై వేలాడుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలించిన కలెక్టర్ విద్యుత్ పోల్స్ ను తీసివేసే విధంగా చర్యలు ముమ్మరం చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. వార్డుల్లో సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో మురుగునీరు చేరకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే విధంగా చూడాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాపువాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. వర్షాకాలం విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక అధికారికి పలు సూచనలు చేశారు. పాఠశాల ఆవరణ చుట్టు మురుగు నీరు చేరడంతో సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల పై తీసుకోవాల్సిన చర్యల పై సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






