బల్దియా భద్రమేనా..?

by Ratna Kumari |

దిశ, భైంసా : ఇటీవల బైంసాలో జరిగిన అక్రమ మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ పక్రియలో అధికారుల తీరు,సహకరించిన సిబ్బంది గురించి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు నిజాలతో బల్దియా

బల్దియా భద్రమేనా..?
X

దిశ, భైంసా : ఇటీవల బైంసాలో జరిగిన అక్రమ మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ పక్రియలో అధికారుల తీరు,సహకరించిన సిబ్బంది గురించి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు నిజాలతో బల్దియా "భద్రమైన" అంటూ ప్రజలలో అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా కొందరు బల్దియాలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నరని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా కార్యాలయంలో హెల్త్ వర్కర్స్ పేరు చెప్పుకుంటూ ఎటువంటి జాయినింగ్ అర్దర్స్ లెటర్స్ లేకుండా ప్రధాన పోస్టుల్లో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవవ్ కి సైతం పలువురు బిజెపి నాయకులు వినతిపత్రం అందించారు.మరోపక్క గత రెండు నెలల క్రితం మున్సిపల్ కార్మికులకు తమ జీతాలు పెంచుతామంటూ కొందరు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉండగా... ఇట్టి విషయంలో సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ ని విచారణ అధికారిగా నియమించినప్పటికీ,ఇప్పటికీ పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో అట్టి విషయాన్ని సైతం కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రస్తుతం జరిగిన అక్రమ మ్యుటేషన్ ప్రక్రియతో బైంసా బల్దియా అవకతవకల విషయం పై అనేక అనుమానాలకు తావిస్తుంది.

అక్రమ మ్యూటేషన్ పై పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి ..

పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో శిధిలావస్థలో ఉన్న ఇంటికి (ఇంటి నెంబర్ 2-2-161) కొందరు దుండగులు నకిలీ పత్రాలను సృష్టించి,ఓనర్ షిప్ ని మార్చేశారు.ఫిర్యాదు దారులు ఓనర్ షిప్ ని అక్రమంగా మార్చారనే ఫిర్యాదు చేయగా, ఈ మేరకు భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా... చాట్లవార్ శైలేష్, గోగుర్ రాజు, రఫీయుద్దీన్ మరియు ఇంతియాజ్ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లో ఉన్నట్లు విచారణలో నిర్ధారించారు. పట్టణానికి చెందిన గోగుర్ రాజు తన స్కూల్‌మేట్ అయిన మహారాష్ట్ర పాలజ్ కి చెందిన చాట్లవార్ శైలేష్‌ను సంప్రదించి, డబ్బు ఆశ చూపించి,ఈ కుట్రలోకి తీసుకొని రాగా, డాక్యుమెంట్ రైటర్ రఫీ తన నైపుణ్యాన్ని ఉపయోగించి,శైలేష్ పేరు మీద నకిలీ నోటరీ అఫిడవిట్‌ను తయారు చేసి, మ్యుటేషన్ కోసం మున్సిపాలిటీలో సమర్పించారు. మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడి, ఏటువంటి గ్రౌండ్ ఎంక్వయిరీ రిపోర్టు, నోట్ ఫైల్ లేకుండా కేవలం ఓటిపి ఆమోదం ఆధారంగానే రెండు మూడు గంటల్లో ముటేషన్ ప్రక్రియ పూర్తి చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

కాంట్రాక్ట్ కాలం ముగిసిన విధుల్లో కొనసాగుతూనే..!

బల్దియాలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ మనీష్ కాంట్రాక్ట్ కాలం రెండున్నర సంవత్సరాల క్రితమే ముగిసినప్పటికీ, విధులు కొనసాగిస్తూ,మున్సిపల్ కమిషనర్ డోoగల్ వాడేవాడని,ఇంతియాజ్‌తో కలిసి పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ అతని ఆదేశాల మేరకు ఓ.టి. పి ఇచ్చేవారని పోలీసుల నిర్ధారణలో వాట్సాప్ చాటింగ్స్ ఇట్టి విషయాన్ని స్పష్టం చేశాయి.ప్రతి పనికి ఆపరేటర్ మనీష్,ఇంతియాజ్ ఆమోదం కోరుతూ...ఆ తర్వాతే మున్సిపల్ కమిషనర్ ఆన్‌లైన్ మ్యుటేషన్ కోసం ఓ.టీ.పీ లను అందించేవారు.అక్రమ డబ్బును 60,20,20 శాతలుగా పంపిణీ అయ్యాయని పోలిసుల నిర్ధారణ గుర్తించారు.

అక్రమ రిజిస్ట్రేషన్ లో సైతం చేతి వాటం

ఎటువంటి గ్రౌండ్ ఎంక్వైరీ,నోట్ ఫైల్ లేకుండా కేవలం మ్యుటేషన్ పక్రియ పూర్తి కాగానే,మున్సిపల్ కమిషనర్ సంతకం లేకపోయినా యాజమాన్య ధృవీకరణ పత్రాన్ని (ఓనర్ షిప్ సర్టిఫికెట్ ) జారీ చేసి, నకిలీ ఓనర్స్ కి అందించారు. ఓనర్ షిప్ ప్రక్రియలో కమిషనర్ సంతకం లేని సర్టిఫికెట్ వున్నందున సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి సైతం డబ్బులు అప్పజెప్పినట్లు పోలీసులు నిర్ధారించారు. రిజిస్ట్రేషన్ అనంతరం నిందితులు ఆ ఆస్తిని రోహిత్ అనే వ్యక్తికి తాకట్టు పెట్టి డబ్బులు సేకరించారు.

అసలు ఓనర్ రావడంతో బాగోతం బయటకి

అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుసుకున్న అసలు ఓనర్ బయటకు రావడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది.​ఈ సంవత్సరం అక్టోబర్ 29న మోసాన్ని తెలుసుకుని అసలు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. విచారణలో పై విషయాలన్నీ వెలుగులోకి రాగా, మోసగాళ్లను రిమాండ్ కు తరలించారు.ఈ తతంగంలో మున్సిపాలిటీ మరియు ఎస్. ఆర్. ఓ లకు సైతం నోటీసులు జారీ చేశారు.దర్యాప్తులో ప్రైవేట్ వ్యక్తులు,మున్సిపల్ కమిషనర్,సిబ్బంది, మరియు ఎస్. ఆర్. ఓ లతో కూడిన వ్యవస్థీకృత మోసాల నెట్‌వర్క్ ఉందని వెల్లడైంది.వాట్సాప్ చాట్‌లు, నకిలీ పత్రాలు, కాల్ లాగ్‌లు, ఆర్థిక లావాదేవీల వివరాలు, మరియు సాక్షుల వాంగ్మూలాలు పోలీసుల నిర్ధారణలో ప్రామాణికాలుగా పనికి వచ్చాయి.

అక్రమ రిజిస్ట్రేషన్ తంతు.. ఐదుగురు రిమాండ్ అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్.

అక్రమ రిజిస్ట్రేషన్ తతంగంలో ప్రస్తుతం ఐదుగురిని రిమాండ్ కు తరలించామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురి నిందితులలో మునిసిపల్ కమిషనర్, ఎస్.ఆర్.ఓ సైతం ఉండగా...ప్రస్తుతం వాళ్ళ మొబైల్స్ సైతం స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని తెలిపారు.

Next Story