- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్ రాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్
పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలను హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

X
దిశ, ఆదిలాబాద్ : పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలను హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంతకాలంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు నిందితులు తిరుగుతూ ప్రజల వద్ద నుండి రూ.100 కే పాత ఫోన్లు కొనుగోలు చేస్తుండగా..వారిని ఎస్ఐ అశోక్ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి 1500 మొబైల్ ఫోన్స్, మదర్ బోర్డ్, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మదర్ బోర్డుల్లోని సమాచారంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ పాల్గొన్నారు.
Next Story






