అంతర్రాష్ట్ర పశువుల అక్రమ రవాణా రాకెట్ భగ్నం చేసిన పోలీసులు

by Ratna Kumari |

దిశ‌, బోథ్ : అంత‌రాష్ట్ర ప‌శువుల అక్ర‌మ ర‌వాణా రాకెట్ ను పోలీసులు భ‌గ్నం చేశారు. ఈ ఘ‌ట‌న నేర‌డిగొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చేందూర్ నివాసి ఇమ్రాన్ బాబు

అంతర్రాష్ట్ర పశువుల అక్రమ రవాణా రాకెట్ భగ్నం చేసిన పోలీసులు
X

దిశ‌, బోథ్ : అంత‌రాష్ట్ర ప‌శువుల అక్ర‌మ ర‌వాణా రాకెట్ ను పోలీసులు భ‌గ్నం చేశారు. ఈ ఘ‌ట‌న నేర‌డిగొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చేందూర్ నివాసి ఇమ్రాన్ బాబు షేక్, ఇచ్చోడకు చెందిన మొహమ్మద్ జాకీర్ లు అక్రమ పశువుల రవాణా రాకెట్ లో పాలుపంచుకొని అదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో పశువులను సేకరించి మొహమ్మద్ ఇమ్రాన్ కు చెందిన వాహనం ద్వారా అనంతపూర్ మీదుగా కొచ్చిన్ లోని మహేంద్ర త్రిమూర్తి వద్దకు తరలించి అక్కడ ఈ ఎద్దులను ఎక్కువ ధరకు విక్రయించేవారు. వీరికి సఫాన్ హనీఫ్ సేథ్, అస్లాం, మొహబూబ్ అలీ ఖురేషి సహాయం అందించేవారు. ఇదే క్రమంలో సోమవారం మొహమ్మద్ జాకీర్, షేక్ ఇమ్రాన్ లు ఇచ్చోడా నుంచి 16 ఎద్దులను కొనుగోలు చేసి అదనంగా మూడు ఎద్దులను దొంగలించారు. వీటిని మొహమ్మద్ ఇమ్రాన్ వాహనంలో కొచ్చిన్ కు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం. ఆధారంగా వారిని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసులో పాలుపంచుకున్న పదిమందిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story