ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమి పూజలో పాల్గొన మంత్రి వివేక్ వెంకటస్వామి..

by Bhanu |

మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన రాజమల్లు, గీతాంజలికి సంబంధించిన భూముల వద్ద భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమి పూజలో పాల్గొన మంత్రి వివేక్ వెంకటస్వామి..
X

దిశ, మందమర్రి : మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన రాజమల్లు, గీతాంజలికి సంబంధించిన భూముల వద్ద భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..ఇది కేవలం ఇళ్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే కాదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందించాలనే లక్ష్యంతో మొదటి అడుగుగా ఇవి జరుగుతున్నాయి అని తెలిపారు.

భూమిపూజ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి. సతీష్ కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, నాయకులు బండి సదానందం, ఉపేందర్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, సొత్కు సుదర్శన్‌తో పాటు పలువురు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




Next Story