- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా అటవీ భూమి ఆక్రమణ.. మంటలు పెట్టి విలువైన సంపద నష్టం
ఇచ్చోడ రేంజ్ పరిధిలో అటవీ భూమి ఆక్రమణతో పాటు మంటలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, బజార్ హత్నూర్: ఇచ్చోడ రేంజ్ పరిధిలో అటవీ భూమి ఆక్రమణతో పాటు మంటలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్ హత్నూర్ మండలంలోని చిన్మయతండకు చెందిన రాబడే కర్తార్ సింగ్ హర్కాయి రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని దిగ్నూర్ శివారులో అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో మంటలు పెట్టడంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచిన ప్లాంటేషన్‌లో మంటలు వ్యాపించి విలువైన అటవీ సంపద కాలిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు వెంటనే స్పందించి.. నిందితుడిని అదుపులోకి తీసుకుని అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా నిందితుడికి 13 రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాలలో అక్రమంగా చొరబడి మంటలు పెట్టి అటవీ సంపదకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు.






