- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీసులు
by Bhanu |
పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు.

X
దిశ, వాంకిడి : పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం వాంకిడిలో చెక్ పోస్టు ఏర్పాట్లను ఎస్ఐ ప్రశాంత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణా కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఎవరైనా అనుమతి లేకుండా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, అక్రమ రవాణా పేరుతో గొడవలు సృష్టిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. పశుసంవర్ధక శాఖ అధికారుల సమన్వయంతో మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తామన్నారు.
Next Story






