భూములు లాక్కుంటే ఎలా బతకాలి..

by Taduka Kalyani |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో మల్లి పోడు వివాదం రగిలింది

భూములు లాక్కుంటే ఎలా బతకాలి..
X

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో మల్లి పోడు వివాదం రగిలింది. గురువారం పులస గ్రామ శివారులోని అటవీ భూమిని జేసీబీతో చదును చేసుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ తాతా ముత్తాతల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, హక్కు పత్రాలు కూడా ఉన్నాయని.. కానీ ఇప్పుడు వచ్చి మా భూములు లాక్కుంటే మేము మా పిల్లలు ఎట్లా బతకాలని ఫారెస్ట్ అధికారులను నిలదీశారు. ఉన్న ఈ భూములను లాక్కుంటే ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అరెస్టు చేసి కేసు పెట్టిన, చంపిన మా సాగు భూములను వదులుకోబోమని పోడు రైతులు వాపోతున్నారు.

Next Story