రోడ్ల పై ఆకతాయిల ఆగడాలు..

by Disha Web Desk 20 |
రోడ్ల పై ఆకతాయిల ఆగడాలు..
X

దిశ, రామకృష్ణాపూర్ : స్కూల్, కాళేజీలకు సెలవులు కావడంతో పట్టణంలో యువత పోకిరీలుగా మరి రెచ్చిపోతున్నారు. రోడ్ల పై బైక్‌లతో విన్యాసాలు చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. శబ్దాలు వచ్చేలాగా వాహనాలతో వచ్చిన సైలెన్సర్లను మార్చడం రయ్‌రయ్‌ మంటూ వెళ్తూ జనసంచారం ఉండే ప్రాంతాలల్లో ఫట్‌ఫట్‌ ఢాంఢాం మంటూ దడ పుట్టించేలా పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయగా, రోడ్డు పై వెళ్తున్న వాహనదారులంతా శబ్దం చేస్తూ వెళ్తున్న వ్యక్తిని మనసులో తిట్టుకున్నారు. రోడ్డు పై వెళ్తున్న అందరి దృష్టిని ఆకర్షించాలని శబ్దాలు వచ్చే హారన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రిళ్లు నిత్యం రద్దీగా ఉండే రోడ్ల పై కొందరు ఆకతాయిలు ఒక్క బైక్ పై ముగ్గురు, నలుగురు కూర్చొని పిచ్చి అరుపులు, కేకలతో స్పీడ్‌ డ్రైవ్‌లు చేస్తూ ప్రమాదకర స్టంట్ లు, అతివేగంగా దూసుకు వెళ్లడంతో మిగతా వాహనదారులు హడలెత్తిపోతున్నారు.

మరికొందరైతే పోలీసులు గుర్తించకుండా నెంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌లపై వెళ్తుండడం నిత్యకృత్యమైంది. కొందరు ఆకతాయిలు రాత్రులు మద్యం వంటి మత్తుపదార్థాలు తీసుకుని చౌరస్తాలో, కాలనీ రోడ్ల పై తిరుగుతూ అడ్డొచ్చిన వారిని దూషించి అనవసర గొడవలకు వెళ్లడంతో విరితిరు ప్రజలకు ఇబ్బందుల పలుచేస్తున్నారు. తమ పిల్లలను అదుపులో పెట్టకుండా తల్లిదండ్రులు గారాబం చేయడంతో ఇంకా రెచ్చిపోతున్నారు. రోడ్లపై పోకిరీల బెడద ఎక్కువ అవుతుందని పోలీసులు వారి పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎస్సై.అశోక్ వివరణ..

తల్లిదండ్రులు తమపిల్లలకు ఖరీదైన బైక్‌లు కొనిస్తున్నామని సంతోషించడం కాదు మొదటగా వారికి డ్రైవింగ్‌, లైసెన్సు, హెల్మెట్‌, వాహనపత్రాల పై అవగాహన కల్పించాలి అన్నారు. ప్రతిరోజూ ప్రధాన సెంటర్లలో వాహనాల తనిఖీ చేపడుతున్నట్లు తెలిపారు. సైలెన్సర్‌ మార్చినట్లు కనిపిస్తే బైక్‌ను సీజ్‌ చేస్తామని అన్నారు.


Next Story

Most Viewed