- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానో యూరియాతో అధిక దిగుబడులు
దిశ, లక్ష్మణచాంద : రైతులు నానో యూరియా వాడితే భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయని ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి అన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలో బుధవారం నానో యూరియా, డీఏపీపై అవగాహన

దిశ, లక్ష్మణచాంద : రైతులు నానో యూరియా వాడితే భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయని ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి అన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలో బుధవారం నానో యూరియా, డీఏపీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి రైతు వేదిక వరకు సాగింది. అనంతరం రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. బస్తాల యూరియా, డీఏపీ వాడకాన్ని తగ్గించి ఈ నానో యూరియా, డీఏపీ వాడితే భూసారం మరింత పటిష్టమవుతుందని తెలిపారు. రైతులు వేసే పంటలు అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శీను, వ్యవసాయ సంచాలకుడు విద్యాసాగర్, ఏవో వసంతరావు. ఏఈవోలు పవిత్ర, సుస్మిత, మౌనిక, ఇఫ్కో సేల్స్ ఆఫీసర్ వికాస్, లక్ష్మణచాంద మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి. నాయకులు వోడ్నాల రాజేశ్వర్, ప్రతాప్ రెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు.






