భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం

by Nallavelli.Anjaneyulu |

ఆదిలాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు.

భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇచ్చోడ మండలంలో భారీగా 420 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు పవర్ మాధవ్ ఇతరులను గంజాయి సేవించేలా చేసి, వారి ద్వారానే విక్రయాలు జరుపుతూ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 420 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.42 లక్షలు అంచనా ఉంటుందన్నారు. గంజాయి సాగు చేసేవారికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.

Next Story