- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను చంపిన భర్త అనుమానస్పదంగా మృతి
మండల కేంద్రంలో గురువారం లట్పటే మారుతి అనే యువకుడు తన భార్య కీర్తి ని గొంతు కోసి అత్యంత కిరాతంగా చంపి పరారీలో ఉన్న విషయం విధితమే.

దిశ, గుడిహత్నూర్: మండల కేంద్రంలో గురువారం లట్పటే మారుతి అనే యువకుడు తన భార్య కీర్తి ని గొంతు కోసి అత్యంత కిరాతంగా చంపి పరారీలో ఉన్న విషయం విధితమే. అయితే శనివారం మండల కేంద్రంలోని చెరువులో జై భీమ్ నగర్ సమీపంలో అనుమానస్పద రీతిలో శవమై కనిపించాడు. శనివారం ఉదయం జై భీంనగర్ కు చెందిన ఓ మహిళ బహిర్భూమికి వెళ్ళగా అక్కడ శవం కనిపించడంతో మహిళల భయంతో కేకలు వెయగా చుట్టుపక్కల వారు రాగ శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇచ్చోడ సిఐ భీమేష్,గుడిహత్నూర్ ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.కుళ్లిపోయి స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. మృతుడు మారుతి తన భార్యను చంపిన రోజే తనను తానుగా కత్తితో తన గొంతు కోసి ఆత్మహత్యకు పాల్పడ్డడా లేదా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడా.అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






