పది సంవత్సరాల కల నెరవేరింది.. గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ

by Batti.Sumithra |

హన్మంత్‌పల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

పది సంవత్సరాల కల నెరవేరింది.. గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ
X

దిశ, లక్షెట్టిపేట : హన్మంత్‌పల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తైనా, స్వంత భవనం లేక కిరాయి ఇళ్లలోనే కార్యాలయం నిర్వహించాల్సి వచ్చేది. దీంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఉపసర్పంచ్ ఆది సుజాత భూమయ్య భవన నిర్మాణం కోసం భూదానం చేయడంతో, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో ఐటీడీఏ నిధుల ద్వారా రూ. 20 లక్షలు మంజూరు అయ్యాయి. దీంతో గ్రామస్థుల చిరకాల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా నాయకులు పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తి చేసి భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story