గ్రీవెన్స్ సెల్ ఇక డిజిటలైజ్

by Batti.Sumithra |

అర్జీ పై సంబంధిత అధికారుల జవాబుదారీతనం, పారదర్శకత పెంచే లక్ష్యంతో ఉట్నూర్ ఐటీడీఏ డిజిటలైజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.

గ్రీవెన్స్ సెల్ ఇక డిజిటలైజ్
X

దిశ, ఉట్నూర్ : గిరిజనులు సమస్యల పరిష్కారానికి ఐటీడీఏలోని గ్రీవెన్స్ సెల్ లో అందించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, అర్జీ పై సంబంధిత అధికారుల జవాబుదారీతనం, పారదర్శకత పెంచే లక్ష్యంతో ఉట్నూర్ ఐటీడీఏ డిజిటలైజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కు వచ్చే అర్జీలను సైట్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ మేరకు గత సోమవారం ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ స్వయంగా ఆవిష్కరించారు.

ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ డిజిటలైజేషన్

గిరిజన ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ చేసి పరిశీలిస్తున్నారు. ఈ ఫిర్యాదులను కొత్త ప్లాట్ ఫాం అయిన ఐటీడీఏ పల్స్ (ITDA Pulse) వేదిక కింద నిక్షిప్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం వచ్చే ఫిర్యాదుల వివరాలను ఇందులో నమోదు చేయడం ద్వారా అర్జీదారులకు ఆ ఆర్జీఎ స్టేజ్లో ఉందో ఇట్టే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ డివిజల్ వ్యవస్థ ద్వారా ప్రతి అధికారి జవాబుదారీగా ఉండే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న ధరఖాస్తుల స్థితిగతులను ఈ వ్యవస్థ ద్వారా నేరుగా పర్యవేక్షించే వీలు ఉందని, దీని వల్ల విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావుడందని అధికారులు తెలుపుతున్నారు.

ఇక ఆన్లైన్ లో వివరాలు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1975లో ఉట్నూర్ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ లో గిరిజనులు సమస్యలపై అందించే ధరఖాస్తులను మ్యానువల్గా స్వీకరించి దరఖాస్తుల స్థితిని బట్టి సంబంధిత అధికారులకు అందజేసేవారు. ఈ నూతన డిజిటలైజ్ ద్వారా అర్జీలన్ని ఇక నుండి ఆన్లైన్ లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.

ఐటీడీఏ చుట్టు తిరుగాల్సిన అవసరం లేకుండా..

ఐటీడీఏలోని గ్రీవెన్స్ సెల్ లో గిరిజనులు ఉందించి ధరఖాస్తులకు ఎలక్ట్రానిక్ ఫిర్యాదు కార్డులో క్యూ ఆర్ కోడ్ ముద్రతో కూడిన రిసిప్ట్ను జారి చేస్తున్నారు. ఈ క్యూ ఆర్ కోడ్ తో స్కానింగ్ చేయగానే దరఖాస్తుదారులు తమ ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఏ అధికారి వద్ద ఉంది, పరిష్కారం అయిందా, పెండింగ్ లో ఉందా లాంటి ఇతర వివరాలు నేరుగా తమ మొబైల్ ఫోన్ లోనే తీసుకునేలా ఐటీడీఏ అధికారులు అప్ డేట్ చేశారు. దీని వల్ల అర్జీదారులు పదే పదే ఐటీడీఏ కార్యాలయం చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ఈ సైట్ను ఆవిష్కరించారు.

త్వరలోనే వాట్సాప్, ఆన్లైన్ లో నమోదుకు చర్యలు..

గిరిజనులు ఫలాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం.. ఈ సమస్యలను పరిష్కరించాలని సోమవారం గ్రీవన్స్ సెల్ లో అందించాలంటే ఐటీడీఏకు వచ్చి ఇవ్వాల్సిందే.. తద్వారా వారు సుదూర ప్రాంతం నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి బస్సు చార్జీలతో రావాల్సిందే. గిరిజనుల బాధలను గ్రహించిన ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ త్వరలోనే గిరిజనులు ఫిర్యాదులను ఎ.ఐ. సహాయంతో వాట్సాప్ ద్వారా, రాబోయే రోజులలో ప్రజలకు అందుబాటులో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పించే వెసులుబాటు కల్పించేందుకు ఐటీడీఏ పీఓ ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతం, బస్సు ఖర్చులు, ఇతర ఖర్చలు తగ్గుతాయని గిరిజనులు అంటున్నారు.

ధరాఖాస్తుల స్థితిగతులను ఈ సరికొత్త నిర్ణయంతో

1) ఫిర్యాదుల పర్యవేక్షణ, త్వరిత పరిష్కారం

2) ప్రతి ఫిర్యాదుపై అధికారుల జవాబుదారీతనం కలిగి ఉండడం

3) ప్రతి ఫిర్యాదుదారునికి “Electronic Grievance Card” జారీ

4) QR కోడ్ ద్వారా ఫిర్యాదు స్థితి తెలుసుకునే సౌకర్యం

త్వరలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు (AI ఆధారిత సేవలు), ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పణకు అందుబాటులోకి రానుంది.

ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ డిజిటలైజ్ పద్ధతి.. యువరాజ్ మర్మట్, ఐటీడీఏ పీఓ

అర్జీదారుల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు, ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. ఫిర్యాదుల పురోగతిని పర్యవేక్షించే అవకాశంతో పాటుగా గిరిజనులు సమర్పించిన ఫిర్యాదుల పట్ల ప్రతి అధికారి జవాబుదారీగా ఉండేలా ఈ డిజిటలైజ్ పద్దతి ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. నూతన డిజిటల్ వ్యవస్థ ప్రజలకు, అధికారులకు ఎంతగానో సహాయపడుతుందని, ప్రతి ఫిర్యాదుదారునికి ఒక ఎలక్ట్రానిక్ ఫిర్యాదు కార్డును జారీ చేస్తున్నామన్నారు. త్వరలో వాట్సాప్ ద్వారా, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించే దిశగా తగు చర్యలు తీసుకోనున్నారు.

Next Story