- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి పండిస్తే ప్రభుత్వ పథకాలు కట్..!
దిశ, ఆదిలాబాద్ : గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ రూరల్

దిశ, ఆదిలాబాద్ : గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అసోద గ్రామంలో భారీ ఎత్తున గంజాయి మొక్కలు పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై విష్ణువర్ధన్ ప్రత్యేక బృందంతో దాడులు నిర్వహించారు.ఇందులో గ్రామానికి చెందిన నిందితుడు మెస్రం భుజంగ్ రావ్ పంట చేనులో అంతరపంతగా గంజాయి మొక్కలను పెంచుతుండగా.. వాటిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ.16 లక్షల విలువ చేసే 160 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందితున్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గంజాయి పండిస్తున్న వారిపై కేసు నమోదు చేసి వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా నివేదికలు పంపనున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది మంగల్ సింగ్, విటల్, సురేష్ లను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు డీఎస్పీ జీవన్ రెడ్డి.






