ఆదిలాబాద్‌కు ఇందిరమ్మ ఇళ్ల శుభవార్త

by Ratna Kumari |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడత కార్యక్రమాన్ని జూన్ 2న ఆదిలాబాద్ నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ఆదిలాబాద్‌కు ఇందిరమ్మ ఇళ్ల శుభవార్త
X

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడత కార్యక్రమాన్ని జూన్ 2న ఆదిలాబాద్ నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో జిల్లాలో సొంత ఇల్లు కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మొదటి విడత లబ్ధిదారుల తర్వాత రెండో విడత కోసం ఎదురుచూస్తున్న అర్హుల్లో ఆశలు మరింత పెరిగాయి.పేదలు నివసించే ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని స్థలాల ఎంపిక, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. జిల్లాలో అద్దె ఇళ్లలో, తాత్కాలిక గుడిసెల్లో జీవిస్తున్న పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా గృహ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు.

Next Story