- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్టకూటి కోసం వెళ్లి.. అనంతలోకాలకు..!
దిశ, ఖానాపూర్ : కుటుంబాన్ని పోషించటం కోసం గ్రామాన్ని విడిచి కూలీ కోసం వెళ్లిన వెంకటేష్ అనంత లోకానికి వెళ్లిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

X
దిశ, ఖానాపూర్ : కుటుంబాన్ని పోషించటం కోసం గ్రామాన్ని విడిచి కూలీ కోసం వెళ్లిన వెంకటేష్ అనంత లోకానికి వెళ్లిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. దస్తురాబాద్ మండల కేంద్రంలోని దావనపల్లి వెంకటేష్ (55), అతని కుటుంబాన్ని పోషించడం కోసం మహారాష్ట్రలోని బీవండి పట్టణంలో వర్క్ షాప్ లో కూలి పని చేయడానికి వెళ్లిన అతనికి గురువారం విద్యుత్ షాక్ తగిలి అక్కడికి అక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించడానికి వెళ్లిన వెంకటేష్ అనంత లోకానికి వెళ్లాడని, కుటుంబీకుల రోదన చూచి కాలనీవాసులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.
Next Story






