జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి దొంగ‌త‌నాలు

by Ratna Kumari |

మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణంలోని జాడి అభిరామ్ అనే యువ‌కుడు మ‌ద్యానికి బాని సై జ‌ల్సాల కోసం అల‌వాటు ప‌డి వ‌రుస దొంగ‌త‌నాలు చేస్తున్న యువ‌కుడిని ప‌క్కా ప్లాన్ తో గురువారం ఎస్సై గోప‌తి న‌రేష్ అరెస్ట్ చేశారు.

జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి దొంగ‌త‌నాలు
X

దిశ‌, మంద‌మ‌ర్రి : మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణంలోని జాడి అభిరామ్ అనే యువ‌కుడు మ‌ద్యానికి బాని సై జ‌ల్సాల కోసం అల‌వాటు ప‌డి వ‌రుస దొంగ‌త‌నాలు చేస్తున్న యువ‌కుడిని ప‌క్కా ప్లాన్ తో గురువారం ఎస్సై గోప‌తి న‌రేష్ అరెస్ట్ చేశారు. ఇత‌ని వ‌ద్ద నుంచి 14.4 గ్రాముల బంగారం, 14 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి యాపల్‌కు చెందిన జాడి అభిరామ్ కూలి పనులు చేస్తూ జీవించేవాడు. మద్యపానం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో జనవరి 30న తన ఇంటి పక్కనే నివసించే సెగ్గం మధు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో ఉన్న 12.5 గ్రాముల బంగారం నగదును దోచుకున్నాడు.​అంతటితో ఆగకుండా, అదే రోజు పక్కనే ఉన్న దుర్గం నాగలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి 08 గ్రాముల బంగారం నగదు చోరీ చేశాడు. దొరికిన రూ. 25,000 నగదుతో నేరుగా గోవాకు వెళ్లి అక్కడ విచ్చలవిడిగా జల్సాలు చేశాడు. గోవాలో డబ్బులు అయిపోవడంతో మిగిలిన బంగారాన్ని అమ్మి మళ్లీ జల్సాలు చేయాలని భావించిన అభిరామ్ తిరిగి మందమర్రి చేరుకున్నాడు. గురువారంబంగారం అమ్మేందుకు వెళ్తున్నాడనే ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. మందమర్రిలోని CER క్లబ్ వద్ద ఎస్సై జి. నరేష్ తన బృందంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ​నిందితుడి వ‌ద్ద‌ నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story