పుట్టిన రోజు వేడుకకు చెత్త బండితో ప్రచారం..

by Disha Web Desk 20 |
పుట్టిన రోజు వేడుకకు చెత్త బండితో ప్రచారం..
X

దిశ, మంచిర్యాల టౌన్ : ఇంటింటికి తిరిగి చెత్తబండితో చెత్త సేకరించాల్సి న మున్సిపల్ సిబ్బంది కాస్త అధికార పార్టీ కౌన్సిలర్ పుట్టిన రోజు సందర్భంగా చెత్త బండికి వాడే మైకు లో కౌన్సిలర్ పుట్టిన రోజుకు సంబంధించిన పాటలు పెట్టుకొని వార్డ్ లో తిరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పూర్తివివరాల్లోకి వెళ్తే గురువారం మంచిర్యాల పట్టణ 5 వ వార్డ్ కౌన్సిలర్ పుట్టిన రోజు ఉండడంతో మున్సిపల్ సిబ్బంది ఆ కౌన్సిలర్ పేరు మీద ఉన్న పాటలను చెత్త బండికి ఉపయోగించే మైక్ లో పెట్టుకొని పలు వార్డ్ లో తిరగడంతో వార్డ్ ప్రజలు విస్మయానికి గురయ్యారు.

ఎంత అధికార పార్టీ నాయుకుడు అయితే మాత్రం ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తి గత ప్రచారానికి వాడుకోవడం ఎంటి అంటూ మండిపడుతున్నారు. ఇలా చేయడానికి పురపాలక అధికారులు అనుమతి ఎలా ఇచ్చారు అని అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. ఎదేమైనప్పటికి మున్సిపల్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed