పంట చేనులో గంజాయి సాగు.. రైతు అరెస్ట్

by Batti.Sumithra |

అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న ఓ వ్యక్తి పై కేసునమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

పంట చేనులో గంజాయి సాగు.. రైతు అరెస్ట్
X

దిశ, ఆసిఫాబాద్ : అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న ఓ వ్యక్తి పై కేసునమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సిర్పూర్ యూ మండలంలోని మారుగూడ గ్రామంలో కోవా అర్జున్ అనే వ్యక్తి పంటపొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం వెళ్లి తనిఖీ నిర్వహించగా 8 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. దీని విలువ సుమారు 80 వేలు ఉంటుందని చెప్పారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని అతని పై కేసునమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story