రైతుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చండి.. రైతుల పోస్ట్ కార్డు ఉద్యమం

by Disha Web Desk 23 |
రైతుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చండి..  రైతుల పోస్ట్ కార్డు ఉద్యమం
X

దిశ‌, చెన్నూరు : చెన్నూర్ నియోజకవర్గంలోని ప‌లువురు రైతులు త‌మ‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. చెన్నూరు మండలం కిష్టంపేటలో ప‌లువురు రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతు హామీలు అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాల‌ని, లేక‌పోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తాం అని రైతులు హెచ్చరించారు.

1. వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ.500 అంద‌చేయాలి

2. రైతు భరోసా రూ.10వేలకి బదులు రూ.15వేలు ఇవ్వాలి

3. రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12 వేలు చెల్లించాలి

4. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు మాఫీ చేయాలి

5. వీటితోపాటు రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ.25వేలు చెల్లించాల‌ని లేఖలో ముఖ్య‌మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని కోరారు.

Next Story

Most Viewed