- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రిజ్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు.. ఇల్లు దగ్ధం
by Bhanu |
లక్షెట్టిపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో ఘోర ఘటన జరిగింది. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు

X
దిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో ఘోర ఘటన జరిగింది. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ధనలక్ష్మికి చెందిన ఇంట్లో గురువారం ఫ్రిజ్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వంటగదిలో ఉన్న ఇంటి సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పొగలు బయటకు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ గోపతి సురేష్ తన సిబ్బందితో వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి మంటలను పూర్తిగా ఆర్పారు. ఈలోగా ఇంటి యజమాని అశ్విన్ అక్కడికి చేరుకునేసరికి మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా అంచనా వేయాల్సి ఉంది.
Next Story






