వర్క్ ఫ్రం హోం పేరిట మోసం.. ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్..

by Taduka Kalyani |   (  Updated:2025-06-23 15:27:48  IST  )

ఇంట్లో కూర్చుని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదివచ్చు అని ఆశ చూపితే నమ్మేస్తున్నారా.. వాట్సాప్, టెలిగ్రామ్ లలో వచ్చే ప్రకటనలు నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా

వర్క్ ఫ్రం హోం పేరిట మోసం.. ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్..
X

దిశ, ఆదిలాబాద్ : ఇంట్లో కూర్చుని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదివచ్చు అని ఆశ చూపితే నమ్మేస్తున్నారా.. వాట్సాప్, టెలిగ్రామ్ లలో వచ్చే ప్రకటనలు నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..! మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లే అంటున్నారు పోలీసులు. తాజాగా ఆదిలాబాద్ లో ఓ బాధితుడు..వర్క్ ఫ్రం హోం పేరిట వాట్సాప్,టెలిగ్రామ్ లలో వచ్చిన మెసేజ్లను నమ్మి ఎక్కువ డబ్బులకు ఆశపడి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ కి చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ అనే బాధితుడు ఈ నెల 14న టెలిగ్రామ్,వాట్సాప్ ద్వారా రూ.5.03 లక్షలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయినట్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లు సౌరభ్ రాయాక్వార్, రతిక్ సేన్ లను అరెస్టు చేశామన్నారు. కాగా ఇప్పటి వరకు ఈ సైబర్ ముఠా లోని నేరగాళ్లు 910 మందిని మోసం చేసినట్లు తెలిసిందన్నారు. వేరే దేశం నుంచి కాల్ సెంటర్ ఏర్పాటు చేసి స్కాం చేస్తారని హెచ్చరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వలలో వేసుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగ యువత, ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి,రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్సై వి.విష్ణువర్ధన్, నవనీత్, సంజీవ్, మండల్ సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story