పూజలు చేస్తానని..పాడు చేశాడు..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-14 23:50:36  IST  )

మంత్రాల నేపంతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నకిలీ బాబాను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.

పూజలు చేస్తానని..పాడు చేశాడు..!
X

దిశ,ఆదిలాబాద్ : మంత్రాల నేపంతో మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన నకిలీ బాబాను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తాజాగా ఆయ‌న మీడియా స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మైనర్ బాలిక తరచూ అనారోగ్యానికి గురవ్వడంతో.. తన స్నేహితురాలు తండ్రి అయిన గాదిగూడకు చెందిన నిందితుడు షేక్ కలీం మంత్రాలు, తంత్రాలు తాయిత్తులతో నయం చేస్తానని నమ్మబలికాడు. బాధితురాలితో సహా వారి కుటుంబీకులను ఈనెల 9న నిర్మల్ జిల్లా సోన్ నది సమీపంలో పలు పూజా కార్యక్రమాలు చేయించారు. తిరిగి 11న బాధితురాలి స్వగృహానికి తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి నిందితుడు బాధితురాలి ఇంట్లో బస చేసి.. పూర్తిగా నయం కావాలంటే ఈరోజు రాత్రి ఒంటరిగా బాధితురాలితో పలు పూజా కార్యక్రమాలు చేయాలని నమ్మబలికి కుటుంబీకులను వేరే గదిలో ఉంచి రాత్రి సమయంలో బాధితురాలి పై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం కుటుంబీకులకు చెబితే వారిని చంపేస్తానని బెదిరించాడు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్ప‌డంతో కుటుంబీకులు వెంటనే ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడి పై ఫోక్సో కేసు నమోదవడంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు సీఐ సునీల్ కుమార్ వెల్ల‌డించారు. మంత్రాలను, తంత్రాలు అనే బాబాల‌ను అస్స‌లు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి వైద్య సమస్యలు ఉన్న నిర్భయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Next Story