మక్కకు నాలుగు బస్తాల యూరియా చాలు

by Ratna Kumari |

దిశ‌, ల‌క్ష్మ‌ణ‌చాంద : మొక్కజొన్న సాగు చేసిన రైతులు నాలుగు బస్తాల కంటే ఎక్కువ యూరియా వాడొద్దని ఆత్మ చైర్మన్ రాంరెడ్డి సూచించారు. మండలంలోని పార్ పెల్లి గ్రామంలో బుధవారం

మక్కకు నాలుగు బస్తాల యూరియా చాలు
X

దిశ‌, ల‌క్ష్మ‌ణ‌చాంద : మొక్కజొన్న సాగు చేసిన రైతులు నాలుగు బస్తాల కంటే ఎక్కువ యూరియా వాడొద్దని ఆత్మ చైర్మన్ రాంరెడ్డి సూచించారు. మండలంలోని పార్ పెల్లి గ్రామంలో బుధవారం యూరియా వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొక్కజొన్న పంటకు ఎక్కువ యూరియా వాడితే దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. బస్తాల యూరియా కంటే నానో యూరియా వాడితే మేలని సూచించారు. యాసంగి పంటల సాగుపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వసంత్ రావు, విస్తీర్ణాధికారి సుష్మిత, వీడీసీ సభ్యులు, ఎరువుల డీలర్లు, ఇఫ్కో మేనేజర్ బాల వికాస్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Next Story