న‌లుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆసిఫాబాద్ : గుట్టు చ‌ప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న న‌లుగురు వ్య‌క్తుల‌పై సీసీఎస్ పోలీసులు

న‌లుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
X

దిశ‌, ఆసిఫాబాద్ : గుట్టు చ‌ప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న న‌లుగురు వ్య‌క్తుల‌పై సీసీఎస్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సీసీఎస్ సీఐ బుద్దె ర‌వీంద‌ర్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కాగ‌జ‌న్ న‌గ‌ర్ మండలంలోని బోరిగాం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నార‌ని వచ్చిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. వీరిలో 4 గురులు పేకాట రాయుళ్లు పట్టు బడ్డారు. వీరి వద్ద నుంచి రూ.19, 830 న‌గ‌దు స్వాధీనం చేసుకుని న‌లుగురి పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Next Story