- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్ని ప్రమాదం.. నాలుగు బైకులు దగ్ధం
ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుని నాలుగు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుని నాలుగు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక బైక్‌లో మంటలు చెలరేగి, పక్కనే నిలిపి ఉంచిన ఇతర బైకులకు కూడా వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది. ఖానాపూర్ కాలనీలోని అక్సా మసీదు సమీపంలో చెట్టు కింద పలువురు తమ ద్విచక్ర వాహనాలను పార్క్ చేసి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఒక బైక్‌లో నుంచి పొగలు రావడం ప్రారంభమై, వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో మూడు బైకులకు కూడా అంటుకుని అవి పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమవగా, వాహన యజమానులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.






