ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారులు

by Ratna Kumari |

ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి మరోసారి బహిర్గతమైంది.బోథ్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్‌లు లంచం తీసుకుంటుండగా పట్టుబడటం కలకలం రేపింది.

ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారులు
X

దిశ, ఆదిలాబాద్(బోథ్) : ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి మరోసారి బహిర్గతమైంది.బోథ్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్‌లు లంచం తీసుకుంటుండగా పట్టుబడటం కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టి.ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ ఎస్.పరశురామ్‌లను అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుడు హరిత హారం ప్రాజెక్ట్ కింద సరఫరా చేసిన నీటి బిల్లులకు సంబంధించిన రూ.5.09 లక్షల చెక్కు క్లియర్ చేయించేందుకు అటవీశాఖ ఉద్యోగులు రూ.40 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.15 వేలు లంచం జూనియర్ అసిస్టెంట్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్వీకరించిన లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మధు తెలిపారు. ఇద్దరు అధికారులు తమ అధికారిక పదవిని దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందడానికి ప్రయత్నించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీని సంప్రదించాలని డీఎస్పీ సూచించారు.

Next Story